సొరకాయతో కఫానికి దూరం

సొరకాయ కనిపిస్తూనే ఇంటికి తీసుకెళ్ళి పప్పు లేదా తాలింపు చేసుకుని తింటుంటాం. కాని అందులో ఔషదగుణాలున్నాయని చాలా మందికి తెలియదు. సొరకాయ కూడా కూరగాయగానే చూస్తుంటారు. కాని దానిని తినబోయే ముందు అందులోని ఔషదాలు ఏమిటి... దేనికి ఉపయోగపడుతాయనే అంశాలను తెసుకుంటే సరిపోతుంది.

సొరకాయ తింటే శరీరానికి కఫాన్ని తగ్గిస్తుంది. సొరకాయ జలబు చేస్తుందని చాలా మందిలో అపోహ ఉంది. వాస్తవానికి జలుబును సొరకాయ తగ్గిస్తుంది. అతి దాహాన్ని కూడా నియంత్రిస్తుంది. ఫలితంగా కడుపులో మంట తగ్గుతుంది. సొరకాయ బాగా చలువ చేస్తుంది.

అరికాళ్ళు పగిలిన చోట సొరకాయ గుజ్జు రాసి మృదువుగా మర్ధనం చేస్తే ఉపశమనం కలుగుతుంది. సొరకాయ గర్భస్రావాన్ని కలిగించే గుణం ఉంది. కాబట్టి దీనిని గర్భణీ స్త్రీలు తినకపోవడమే మంచిది.

వెబ్దునియా పై చదవండి