కమలా పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఔషధ గుణాలు శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. కమలా పండుతో పాటు వాటి తొక్కలతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చును.. చాలామంది మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్, గుండె వ్యాధులు, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ వ్యాధుల నుండి విముక్తి చెందాలంటే.. రోజూవారి డైట్‌లో నారింజ తీసుకుంటే చాలు..
1. నారింజలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, న్యూటియన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి.
4. చిన్న వయస్సులోని చాలామంది కంటి చూపు కోల్పోతుంటారు. ఈ సమస్య తొలగించాలంటే.. నారింజ తొక్కలను పొడిచేసి ఇందులో కొద్దిగా రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి కంటి కింద రాసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే కంటి సమస్య పోతుంది.
5. జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది. నారింజ తొక్క పొడిలో కప్పు పెరుగు, మెంతిపొడి, కలబంద గుజ్జు కలిపి జుట్టు పూతలా వేసుకోవాలి. రెండుగంటల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కోసారి చేసినా జుట్టు రాలిపోకుండా ఉంటుంది.