నిమ్మకాయ అనేది నేచురల్‌గా లభించే యాంటీ బాక్టీరియల్. నిమ్మకాయంలో సిట్రిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలు ఉంటాయి. అధికంగా విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మానికి అందాన్ని, చర్మం కాంతివంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. నిమ్మకాయ లివర్‌కు శక్తినిస్తుంది. అలాగే కళ్ళకు సంబంధించిన వ్యాధులురాకుండా బాగా పనిచేస్తుంది. పళ్ళు తెల్లగా రావడానికి కూడా నిమ్మకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయ బద్దలతో పళ్ళు తోమితే దంత వ్యాధులు రాకుండా పళ్ళు తెల్లగా ఉంటుంది.
పవర్‌ఫుల్ యాంటీ బాక్టీరియల్‌గా నిమ్మకాయ పనిచేస్తుంది. స్నానం చేసేటప్పుడు నిమ్మరసం పిండుకుని స్నానం చేస్తే చర్మం మీద క్రిములు నశిస్తాయి. ఇలా చేస్తే క్రిములు చనిపోతాయి. గుండెలో మంట ఉన్నవారు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే మంచిది. అలాగే నిమ్మరసాన్ని తరచుగా వాడితే కడుపులోని నులి పురుగులు కూడా నశిస్తాయి.