ప్లాస్టిక్ బాటిళ్ళలో వేడి నీళ్లు నింపడం మంచిదేనా?

ఆదివారం, 21 మే 2023 (11:58 IST)
మార్కెట్‌లో తక్కుప ధరకు లభిస్తున్నాయని ప్లాస్టిక్ బాటిళ్లను కొని, వాటిలో నీళ్ళను నిల్వ ఉంచుతుంటారు. ఇలాంటి బాటిళ్లలో వేడినీళ్లు నింపడం అస్సలు ఏమాత్రం ముఖ్యం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. దీంతో ఎక్కడకు వెళ్లినా తమ వెంట నీళ్ల సీసాను వెంటబెట్టుకుని వెళుతున్నారు. ఇంతవరకు బాగానే వుంది. కానీ, ఈ బాటిళ్లను ఎప్పటికపుడు శుభ్రం చేయకపోతే అనారోగ్యాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే, ఈ అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి బాటిల్స్ వాడాలి... ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? చూద్దామా? తక్కువ ధరకే దొరుకుతాయి. చూడ్డానికీ బాగుంటాయి అనే కారణంతో చాలామంది ప్లాస్టిక్ సీసాలను వాడుతుంటారు. కానీ వీటిని దీర్ఘకాలం వాడటం తీవ్ర అనారోగ్యాలకు దారి తీయొచ్చు. మరీ ముఖ్యంగా వీటిల్లో వేడినీటిని నింపడం అస్సలు మంచిది కాదు. 
 
గాజు, రాగి, స్టీల్ సీసాలను ఎంచుకోండి. ఏ రకం సీసాల్లో నీళ్లు పట్టినా... సరే! అందులో ఎక్కువ సమయం నిల్వ ఉంచొద్దు. ఏ రోజుకా రోజూ శుభ్రం చేశాకే... వాటిని వాడాలి. నీళ్ల బాటిళ్లను కాస్త ఉప్పు, బేకింగ్ సోడా, గోరువెచ్చటి నీళ్లల్లో వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే దుర్వాసన దూరం అవుతుంది. ఫంగస్ వంటివీ దరిచేరవు. అప్పుడప్పుడూ వెనిగర్‌లోనూ శుభ్రం చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు