కాకర కాయ జ్యూస్ తాగండి.. వంద రోగాలను తరిమికొట్టండి (video)
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (06:53 IST)
కాకర కాయ రసం చేదుగా ఉన్నా.. ఈ చేదే ఎన్నో ఔషాధాల సమ్మేళనం అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్నో ఔషధ ప్రయోజనాలు దాగి ఉన్న కాకరకాయను పండు వలే సేవించమని సలహా ఇస్తున్నారు.
కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని తెలిసిందే. కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
అనారోగ్య సమస్యలను తగ్గించడంలో అయితే కేవలం షుగర్‌నే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ కాకరకాయ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది.