ఆరోగ్యానికి అంజీర ఫలము

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:04 IST)
నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది.

సూవర్‌ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అరజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి.

ఎలర్జీ దగ్గు, కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది.
 
రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది. ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ పండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది.

అన్ని మేడివండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర తరహా మాత్రం కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాము అనివిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు