దంతాలు ముత్యాల్లాగా ఉండాలని కోరుకుంటున్నారా? ఇలా చేయండి.

శుక్రవారం, 15 మార్చి 2019 (15:18 IST)
దంతాలు తెల్లగా ఉండాలని కోరుకోని వారుండరు. ఖరీదైన చికిత్స చేసుకోవడం అందరికీ వీలు కాదు కాబట్టి.. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే సరి.
 
* మీ దంతాలు తెల్లగా మెరిసేలా చేయడంలో అరటి తొక్కలు బాగా ఉపయోగపడతాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు అరటితొక్కను పళ్లపై రుద్దండి. దానిలో ఉండే పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం మినరల్స్​ పళ్లకు అంది తెల్లగా మెరుస్తాయి. నారింజ తొక్కలతోనూ ప్రయత్నించవచ్చు.
 
* స్ట్రాబెరీలో పళ్లను మెరిపించే అనేక మినరల్స్​ ఉంటాయి. స్ట్రాబెరీని గుజ్జుగా చేసి, పళ్లకు పట్టించి మూడు నిమిషాల పాటు ఉంచాలి. స్ట్రాబెరీలో ఉండే మాలిక్ యాసిడ్ పళ్లను తెల్లగా చేయడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా అందులో ఉండే ఫైబర్ పళ్ల మధ్య ఉండే బ్యాక్టీరియాను చంపి నోటిని శుభ్రం చేస్తుంది.
 
* క్యారెట్‌ను శుభ్రంగా కడిగి, నమిలితే చాలు. అది సహజమైన క్లీనర్‌గా పని చేస్తుంది. అలాగే పళ్లను పట్టిన పాచిని వదిలిస్తుంది. ఇది బ్యాక్టీరియాను చంపడమే కాకుండా.. ఇందులో ఉన్న ఆరోగ్యవంతమైన జిగురు పళ్లను తెల్లగా మారేలా చేస్తుంది. నోటి నుండి వచ్చే దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది.
 
* పొగత్రాగడం వల్ల పళ్లు పసుపు రంగులోకి మారుతాయి. పలు రకాల వ్యాధులు రావడానికి కూడా ఇది కారణమవుతుంది. మీ పళ్లు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉండాలంటే పొగత్రాగడం తప్పనిసరిగా మానివేయాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు