రెండు చెంచాల తేనెలో చిటికెడు దాల్చిన చెక్కపొడి, కొద్దిగా నిమ్మ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే, చర్మ గ్రంధులు శుభ్రపడి, మొటిమలు తగ్గుముఖం పడతాయి.
బొప్పాయిలో ఎ, సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జిడ్డుని ఆదుపులో ఉంచుతాయి. బొప్పాయి గుజ్జుని ముఖానికి లేపనంలా రాసి ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడగాలి. ఇలా తరచూ చేస్తే మార్పు కనిపిస్తుంది. ముఖచర్మం కాంతులీనుతుంది.