సహజగుణాల నిధి.. సర్వరోగ నివారిణి... వేప ఆకు

సోమవారం, 31 ఆగస్టు 2015 (19:37 IST)
వేపచెట్టును సహజగుణాల నిధిగా పిలుస్తారు. దీనికి సర్వరోగ నివారిణిగా కూడా పేరుంది. ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయుల జీవనంలో వేపచెట్టు ఒక భాగమైపోయింది. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు.. ఇలా అన్నీ ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఉపయోగాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
చర్మసంబంధ వ్యాధుల్ని తరిమికొట్టే చక్కటి ఔషధం వేప. అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది. వేపాకు బ్యాక్టీరియా, ఫంగస్‌ నివారిణిగా పని చేస్తుంది. వేపాకును కాల్చితే ఆ పొగకు ఇంట్లోని ఈగలు, దోమలు పారిపోతాయి. 
 
ముఖంపై ఉండే మొటిమల్ని వేపనూనెను ఉపయోగించి పోగొట్టవచ్చు. వేపాకు రసంతో జుట్టులో ఉండే చుండ్రును పోగొట్టవచ్చు. కురులు పెరగటానికి, బలంగా ఉండేందుకు, చర్మ సౌందర్యానికి వేపనూనె ఉపయోగిస్తారు. చర్మంపై ఉండే ఇరిటేషన్‌, చర్మం ఎర్రబడిపోవటం వంటి వాటికి వేపనూనె పట్టించి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి