దానిమ్మ పూలు ఔషధం... ఎలాగో తెలుసా?

గురువారం, 14 జులై 2022 (23:34 IST)
దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. దానిమ్మ పువ్వును చూర్ణం చేసి రసాన్ని పిండుకుని ఒక ఔన్సు రసం తీసుకోవాలి. అర ఔన్సు స్వచ్ఛమైన తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

 
ఆరోగ్యవంతమైన శరీరం కావాలనుకునే వారు దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారై ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చు. గర్భాశయం దృఢంగా ఉండాలంటే దానిమ్మ పువ్వును కషాయం చేసి ఉదయాన్నే పరగడుపున తాగితే గర్భాశయం దృఢంగా మారుతుంది.

 
రుతువిరతి సమయంలో స్త్రీలు మానసికంగా భావోద్వేగానికి గురై చేతులు, కాళ్లు, తుంటి కీళ్ల నొప్పులకు గురవుతారు. అలాంటి సమయంలో దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే ఫలితం వుంటుంది.
 
కొందరికి కడుపులో గ్యాస్ ఇరిటేషన్ వల్ల కొద్దిగా తింటే కడుపు నిండిపోయి ఆకలిగా అనిపించదు. అలాంటి సమస్య ఉన్నవారు దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే చికాకు తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు