కెప్టెన్ సంగక్కర హాఫ్ సెంచరీ మిస్: శ్రీలంక స్కోరు 120/3

ముంబైలో భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ పోరులో శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర అర్థసెంచరీని చేజార్చుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి నిలకడగా ఆడిన కుమార సంగక్కర హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో యువరాజ్ బంతికి పెవిలియన్ ముఖం పట్టాడు. తద్వారా 27.5 ఓవర్లలోనే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

భారత్-శ్రీలంకల మధ్య వాఖండే స్టేడియంలో ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఓపెనర్ ఉప్పల్ తరంగ కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జహీర్ ఖాన్ బంతికి తలొగ్గాడు. ఇదే తరహాలో మరో ఓపెనర్ దిల్షాన్ క్రీజులో నిలదొక్కుకుని ఆడినప్పటికీ భజ్జీ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు.

అలాగే కెప్టెన్ సంగక్కర కూడా 67 బంతుల్లో ఐదు పోర్లతో 48 పరుగులు సాధించాడు. కానీ అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న సంగక్కరను యువీ అవుట్ చేశాడు. ప్రస్తుతం జయవర్ధనే (33), సమరవీర (0)లు క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, భజ్జీ, యువరాజ్ సింగ్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు పడగొట్టాడు.

వెబ్దునియా పై చదవండి