ప్రపంచ దేశాలలో 'భారతీయ' సౌందర్యం

ప్రపంచ దేశాలలో భారతీయ సౌందర్యానికి ఓ గుర్తింపు తెచ్చిన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. ఆమె దక్షిణభారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని
WD PhotoWD
మంగుళూరులో 1973 నవంబరు ఒకటో తేదీన జన్మించారు. అయితే.. ఐశ్వర్యకు నాలుగేళ్లు ఉన్నపుడు ఆమె కుటుంబం వృత్తి రీత్యా ముంబైకు తరలివెళ్లింది. ఐష్ తండ్రి నావికాదళ అధికారిగా పనిచేసేవారు. ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న ఆర్యవిద్యా మందిర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఐష్.. పాఠశాలలో మిగిలిన విద్యార్థుల కంటే మంచి తెలివి తేటలు కలిగివుండేది.

పాఠశాల విద్య ముగిసిన తర్వాత డిజి రుప్‌రలే కళాశాలలో చేరిన ఐశ్వర్యారాయ్ తనకు అత్యంత ఇష్టమైన జువాలజీతో కూడిన సైన్స్ సబ్జెక్టులను ఎన్నుకుంది. డాక్టర్ కావాలన్న చిన్ననాటి ఆశయంతో ఈ గ్రూపును ఎన్నుకుంది. అయితే.. అది జీవితంలో ఆమెకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. దీనికి బదులుగా ఆర్కిటెక్చర్‌ను ఎన్నుకున్న ఐశ్వర్య రాయ్ రహేజా కళాశాల నిర్వహించిన ఫ్లైయింగ్ కలర్స్‌ ఇంటర్వూలో ఉత్తీర్ణురాలైంది.

ఇదే సమయంలోనే ఐష్.. మోడలింగ్‌పై దృష్టి సారించింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఐష్.. పెప్సీ శీతల పానీయాల ఉత్పత్తుల కంపెనీకి మోడలింగ్‌గా చేసింది. తొలుత మిస్ ఫెమీనా వరల్డ్‌గా ఎన్నికైన ఐష్.. ఆ తర్వాత 1994లో సన్‌సిటీలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విశ్వవిజేతగా ఎన్నికైంది. బాలీవుడ్ చిత్రరంగంలో ప్రవేశించిన ఐశ్వర్యారాయ్‌కు ఐష్, ఐషు, గుల్లు అనే నిక్‌నేమ్‌లు ఉన్నాయి.