భారత కీర్తిని ఇనుమడింపజేసిన సానియా

WD PhotoWD
తన క్రీడా ప్రతిభతో అంతర్జాతీయంగా భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన టెన్నిస్ సంచలనం సానియా మీర్జా. పుట్టింది దేశ వాణిజ్యరాజధాని ముంబైలో అయినప్పటికీ.. పెరిగింది మాత్రం మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే. 1986 నవంబరు 15వ తేదీన జన్మించిన సానియా మీర్జాకు టెన్నిస్ క్రీడపై చిన్ననాటి నుంచే అత్యంత మక్కువ. ఆరో ఏట నుంచే టెన్నీస్ ఏస్‌ను చేతపట్టిన సానియాకు ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా కోచ్‌గా మెళకువలు నేర్పించాడు.

టెన్నిస్ కోర్టుల్లో కురచదుస్తుల్లో కనిపించే.. సానియా తన ఆట తీరుతో హావభావాలతో కోట్లాది మంది భారతీయులనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 2005 యూఎస్ ఓపెన్‌ టెన్నిస్ టోర్నీలో నాలుగో రౌండ్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సానియా.. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-30 టెన్నీస్ క్రీడాకారుల్లో ఒకరిగా నీరజానాలు అందుకుంటోంది.

5.7' అడుగుల పొడవు కలిగిన సానియాను 2004లో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. 2003లో బాలికల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ ఛాంపియన్‌షిప
WD PhotoWD
టోర్నీని కైవసం చేసుకున్న సానియా.. స్వేట్లానా కుజెంత్సోవా, నాడియా పట్రోవా, మార్టినా హింగీస్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించింది.

2005లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నీస్ టోర్నీలో మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన తొలి భారత టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా రికార్డులకెక్కింది. ఇదే ఏడాది హైదరాబాద్ ఓపెన్ ఫైనల్ టోర్నీలో ఉక్రైయిన్‌కు చెందిన అలియోనా బొండారెంకోను ఓడించి డబ్ల్యూటీఏ సింగిల్ టైటిల్‍‌ను కైవసం చేసుకుంది. 2006లో దోహాలో జరిగిన దోహా ఆసియన్ క్రీడల్లో టెన్నీస్ ఆటగాడు లియాండర్ పేస్‌తో కలసి త్రివర్ణ పతాకాన్ని చేతపూని సగర్వంగా మార్చిఫాస్ట్‌లో పాల్గొంది.