రాజకీయాలలో యువతకు పెద్ద పీట వేయాలి

మంగళవారం, 14 ఆగస్టు 2007 (20:13 IST)
చారిత్రాత్మకమైన 60వ స్వాతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకోబోతున్నప్పటకి, దేశంలోని అనేక ప్రాంతలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రాంతలలో కనీస అవసరాలైన వసతి, విద్య, వైద్య సౌకర్యాలు అందకపోవటానికి బలీయమైన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలేననీ, ఈ పరిమాణల దృష్ట్యా మరో స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలకవలసిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సత్తా పార్టీ జాతీయ సమన్వయ కర్త డా|| జయప్రకాశ్ నారాయణ్ అంటున్నారు.

ప్రజాసేవకు దగ్గర అవ్వాలనే ఆకాంక్షతో వైద్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి కలెక్టరుగా బాధ్యతలు చేపట్టి, ప్రజాసేవ చేయాలనే దృక్పధంతో లోక్‌సత్తా పార్టీ స్థాపనకు సూత్రదారి అయ్యారు జయప్రకాశ్ నారాయణ్.

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా, కంకిపాడు సమీపంలో మైనర్ పంచాయితీగా వున్న పుదిపాడు గ్రామంలో బాల్యజీవితాన్ని గడిపిన జయప్రకాష్ నారాయణ్ వృత్తిరీత్య డాక్టరుగా కొంత కాలం పని చేసినప్పటికీ సంతృప్తి చెందని ఆయన ప్రజలకు మరింత చేరువ కావలనే కోరికతో 1980లో ఇండియన్ అడ్మినీస్ట్రేటివ్ సర్వీస్ (I.A.S.)కి ఎంపికైయ్యారు.

కలెక్టరుగా బాధ్యతలు నిర్వహించటంతోపాటు, ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు సెక్రెటరీగా వివిధ శాఖలలో 17 సంవత్సరాలపాటు పని చేసిన ఆయన 1996లో పదవికి రాజీనామా చేసి లోక్‌సత్తా పార్టీ స్థాపించారు. 60 వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శ్రీ జయప్రకాష్ నారాయణ్‌ను వెబ్‌దునియా తెలుగు ప్రత్యేక ఇంటర్యూ చేసింది. ఆ విశేషాలు మీకోసం...

వెబ్‌దునియా: స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో మన దేశం ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే వుండటానికి కారణాలేమిటి?
జె.పి: ఈ ప్రశ్నకు సంబంధించి ప్రస్తుతం వున్న రాజకీయాలే ఇందుకు కారణాలని చెప్పాలి. 75 శాతం రాజకీయాలు కలుషితమైనవని మనకి అర్థమౌతుంది. నేటి రాజకీయ నాయకులు రాజకీయ రంగాన్ని సామాజిక బాధ్యతగా కాక ఓ వ్యాపార రంగంగా చూస్తున్నారు. దీని వలన ప్రజలకు అవసరమైన అబివృకద్ది విషయంలో కొంత దూరమవుతున్నాం.

అభివృద్ధి చెందుతున్న దేశంగానే పాఠ్యపుస్తకాలలో మేము చదివాం. తరువాతి తరం వాళ్ళు చదివారు. ఇక ముందు బావితరాలు మాత్రం భారత దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా చదవాలనే ఉద్దేశంతోనే లోక్‌సత్తా పార్టీ ముందుకు వెళుతుంది. అయినప్పటికీ దేశం పూర్తిగా వెనుకబడి లేదు. కొన్ని కొన్ని దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఫార్మా తదితర రంగాలలో ముందున్నదనే చెప్పాలి.

వెబ్‌దునియా: దేశం అబివృద్ది చెందక పోవాటానికి కారణం యువతకి ప్రాదాన్యత ఇవ్వక పోవటమని మీరు భావిస్తున్నారా?
జె.పి: స్వతంత్ర సంగ్రామ రోజులకు - నేటికి పోలిస్తే యువతరానికి రాజకీయ రంగాలలో ప్రోత్సాహం తగ్గిందనే చెప్పాలి. అప్పట్లో స్వాతంత్ర్య కోసం యువతరం చేసిన పోరాటం చరిత్ర మనకి చెప్పకనే చెబుతుంది. వారికి సరైన మద్దతు ఇచ్చినట్లయితే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని ప్రస్తుత వర్తమాన సంఘటనలు తెలియజేస్తున్నాయి.

వెబ్‌దునియా: మనం స్వాతంత్రన్ని సాధించినప్పటికి దానితోపాటు స్వేచ్ఛ కూడా వచ్చిందని అనుకుంటున్నారా?
జె.పి: స్వేచ్ఛ - స్వాతంత్రం రెంటికి అవినాభావా సంబంధం వున్నప్పటికి నేడు స్వేచ్ఛ కోసం ఉద్యమించ వలసిన అవసరం వుంది. స్వాతంత్రం వలన స్వపరి పాలన, ఎన్నికలలో ఓటింగ్ విధానం, స్వయంప్రతిపతి వంటి అంశాలను మనం పొందగలిగాం. అయితే భారతీయ పౌరులు ఎన్నికల సమయంలో ఓటు వేసే పద్ధతిలలో స్వేచ్ఛ కొరవడినదిని చెప్పాలి. ఇక స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించడానికి మరో స్వాతంత్ర్యోద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.

వెబ్‌దునియా: లోక్‌సత్తా పార్టీలో యువతకి ఏ మేరకు ప్రాధాన్యత వుంది?
జె.పి: లోక్‌సత్తా పార్టీ యువతకి పెద్దపీఠ వేస్తుంది. 70 నుంచి 80 శాతం వరకు యువతకే ప్రాధాన్యత వుంది.

వెబ్‌దునియా: గతంలో లోక్‌సత్తా పార్టీ రాజకీయ ఉద్యమానికైనా దూరంగా ఉంటుందని ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉద్యమాలు లేకుండా మనుగడ సాధించగలవని అనుకుంటున్నారా?
జె.పి: ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉద్యమాలు తప్పని సరి. ఉద్యమాలు కేవలం రాళ్ళు విసరటం, పోలీసుల లాఠీలతో దెబ్బలు తినటం కాదు. దానికి స్పష్టమైనా పరిష్కారం చూపాలి. దానికి అనుగుణంగానే లోక్‌సత్త పార్టీ ప్రజాసమస్యలపై స్పందింస్తుంది.

వెబ్‌దునియా: 60వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
జె.పి: ఒకటే చెబుతున్నా రాజకీయ పక్షాళన జరగాలంటే యువతకి సరియైన అవకాశాలు కల్పించ వలసిన అవసరం వుంది. తద్వారానే ఏ రంగమైనా అభివృద్ది చెందటానికి అవకాశాలుంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని యువత ముందడుగు వేయాలి. స్వార్థపర రాజకీయ నాయకుల వలలో చిక్కుకుని నవ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. అప్పుడే స్వాతంత్ర ఫలాలు ప్రతి గ్రామానికి తప్పకుండా చేరతాయి.

వెబ్దునియా పై చదవండి