స్వాతంత్ర్య స్మృతి పథంలో 'తమిళ వీరులు'

FileFILE
భారత స్వాతంత్ర్య 60వ వార్షికోత్సవాల సందర్భంగా.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో స్వేఛ్ఛా భారతావని కోసం ఎందరో మహనీయులు పాటుపడ్డారు. అలాంటి వారిలో వీరపాండ్య కట్టబొమ్మన్ అగ్రగణ్యుడు. భారత స్వాతంత్ర్య పోరాటానికి ముందే.. తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన త్యాగవీరుడు. ఆయన తర్వాత చెప్పుకోదగిన స్వాతంత్ర్య సమరయోధుల్లో వీవో.చిదంబనార్, విశ్వనాథ దాస్, తిరుప్పూర్ కుమరన్, మహాకవి భారతీయార్ ఇలా... ఎందరో ప్రముఖులు ఉన్నారు. వారిలో కొంతమందిని ఈ షష్టిపూర్తి స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా స్మరించుకుందాం. వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

వీరపాండ్య కట్టబొమ్మన్...
"ఎందుకు కట్టాలిరా నీకు శిస్తూ... నారు పోశావా.. నీరు పోశావా.."అంటూ తెల్లవారిని నిలదీశిన యోధుడు. శిస్తుకోసం వచ్చిన ఈస్టు ఇండియా కంపెనీ వారిని ఎదిరించాడు. దీంతో.. పాంచాలకురిచ్చి కోటను పాలిస్తున్న వీరపాండ్య కట్టబొమ్మన్‌పై ఆంగ్లేయ సైనికులు దాడి చేశారు. ఆంగ్లేయుల సైనిక బలం ముందు కట్టబొమ్మన్ సైన్యం తలవంచక తప్పలేదు. దీంతో వారికి చిక్కకుండా తప్పించుకున్న కట్టబొమ్మను చివరకు.. పుదుక్కోట్టై వద్ద పట్టుకున్న తెల్లదొరలు ఉరితీశారు. ఇలా.. స్వాతంత్ర్య పోరాటినికి ముందే..అశువులు బాసిన వీరుడిగా కట్టబొమ్మన్ చరిత్రలో నిలిచిపోయాడు.

విశ్వనాథదాస్..
"తెల్లకొంగ ఎగురుతోంది పాప... (కొక్కు పరక్కుదడి పాప్పా)" అంటూ ఆయన పాడిన గేయం యావత్ తమిళులను ఉర్రూతలూగించింది. సేచ్చా భారతికి కంకణబద్దులను చేసింది. నాటకాల ద్వారా ఆయన స్వాతంత్య్ర జ్వాలలను ప్రజల్లో రగిలించారు. 1919 జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనను గేయాల ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించి వారిలో ఆంగ్లేయిలపై వ్యతిరేక జ్వాలలు రగిలించారు. బ్రిటిషు వారు ఆయన నాటకాలపై నిషేధం విధించి ఆయన్ను జైల్లో పెట్టంది.

వీఓ చిదంబరనార్..
"కప్పల్ ఓట్టియ తమిళన్" (పడవ నడిపిన తమిళుడు)గా ఖ్యాతి పేరుగాంచిన భారత మాత ముద్దుబిడ్డ. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి 1906లో స్వదేశీ నౌకయాన సంస్థను నెలకొల్పారు. పరాయి పాలన కష్టనష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. 1908లో తిరునెల్వీలిలో దేశాభిమాన సంఘాన్ని స్థాపించారు. బ్రిటీషు వారు ఆయన్ను అరెస్టు చేసి 40 ఏళ్లపాటు కారాగారంలో బంధించి కఠినంగా శిక్షించారు. జైల్లో చిత్రహింసలకు గురైన చిదంబరనార్ చివరకు జైల్లోనే తుదిశ్వాస విడిచారు.

శంకరలింగనర్..
1895వ సంవ్సరంలో జన్మించిన శంకరలింగనర్ ఈయనకు కండన్ అనే పేరుకూడా ఉంది. ఎనిమిదో తరగతి వరకు చదివిన ఈయన వీఓ.చిదంబరనార్ ప్రసంగాలతో ఉత్తేజితులై దేశభక్తి పెంచుకున్నారు. 1917న కాంగ్రెస్ ఉద్యమంలో చేరిన శంకరలింగనార్ 1920న `మాదర్ కడమై`(మహిళా బాధ్యత) అనే గ్రంథాన్ని అవిష్కరించారు. 1925లో గాంధీని కలిసిన ఆయన అప్పటి నుంచి తాను కూడా నూలువడికే పని చేపట్టారు. తిరుచ్చి సత్యాగ్రహ పోరాట కేసులో ఆరునెలల కఠినకారాగార శిక్ష, కరూర్‌ కేసులో మరో ఆరునెలల కఠినకారాగారం అనుభవించారు. భారత స్వాతంత్ర్యోద్యంలో పాల్గొన్న ఆయన మదరాసును తమిళనాడుగా వ్యవహరించాలని నిరాహారా దీక్షసైతం చేపట్టారు. 76 రోజుల దీక్ష తర్వత తన 62వ ఏటా 1956లో అక్టోబరు 13 మరణించారు.

తిరుప్పూర్ కుమరన్..
`తాను నేలకొరుగుతున్నా భారతమాత పతాకాన్ని నేలకొరగనివ్వని` గొప్ప దేశ భక్తుడు. చిరుప్రాయంలోనే భారతమాత స్వేచ్ఛావాయువల కోసం రగిలిపోయిన తమిళ యువ కెరటం. అసులు పేరు కొడికాత్త కుమరన్. ఆంగ్లేయిలపై జరిపిన అసమామైన పోరు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో కుమారన్ పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసింది. 1932లో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో కీలకపాత్ర వహించాడు. ఆంగ్లేయిలకు వ్యతిరేకంగా తిరుప్పూరులో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనపై బ్రిటిషు వారు విరుచుకుపడ్డారు.

సైనికులతో లాఠీచార్చి చేయించారు. భారతమాత పతాకాన్ని చేత పూని ప్రదర్శనలో నడుస్తున్నా కుమరన్‌ను విచక్షణారహితంగా కొట్టారు. తల పగిలి రక్తం ఏరులై ప్రవహించింది. సోమ్మసిల్లి పోయాడు. అయినా చేతపట్టిన భారత మాత పతాకాన్ని మాత్రం నేలవాల్చలేదు. ఆంగ్లేయిల చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ కుమరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 1932 జనవరి 11న ఆసువులు బాసారు. కుమరన్ త్యాగానికి గుర్తుగా కోయంబత్తురు జిల్లా తిరుప్పూరులో ప్రభుత్వం స్మారక మందిరం నిర్మించింది.

మహాకవి `భారతి`..
`సుందర తెలుగు` అంటూ తెలుగు తీయదనాన్ని గుర్తించి చాటిన కవి. పత్రికాముఖంగా జనుల్లో స్వతంత్ర్య కాంక్షను రగిలించిన దేశ భక్తుడు. పదకొండేళ్ల చిరు ప్రాయంలోనే తన కవితా పటిమతో మహారాజ సంస్థానం నుంచి `భారతి` బిరుదు పొందారు. 1905లో రాజకీయ రంగప్రవేశం చేసి వీఓ చిదంబరనార్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నారు. చెన్నై నుంచి వెలువడిన `ఇండియా` వార పత్రికకు సంపాదకీయాలు అందించారు.
FileFILE


భారతి తొలి కవిత `స్వదేశీ గీతంగళ్` అచ్చురూపంలో విడుదలైంది. 1908లో `ఇండియా` పత్రికను పుదుచ్చేరి నుంచి ప్రచురించి ప్రజలను స్వాతంత్ర్య సమరం వైపు నడిపించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వం ఆ పత్రికను భారతదేశంలో నిషేధించింది. 1921లో ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న సుబ్రమణ్య భారతి అదే ఏడాది సెప్టెంబరు 11 అర్థరాత్రి అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు.