కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్ర్య సంబరాలు

రాష్ట్ర పాలనాధీశులు, ఇతర ముఖ్య అధికారులు అందరూ కలిసి పాల్గొనే స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు భద్రత కల్పించడం నిజంగా ఓ సవాల్ లాంటిదే. ముఖ్యంగా ఉగ్రవాద చర్యల నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ఉగ్రవాదుల హిట్ లిస్టులో హైదరాబాదు ఉందన్న సమాచారంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మన రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటే.... శుక్రవారం ప్రధాని పాల్గొనబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎర్రకోటపై జాతీయపతాక ఆవిష్కరణ సమయంలో సమీపంలో విమాన రాకపోకలను నిషేధించారు.

సుమారు 60 వేల మంది ఢిల్లీ పోలీసులు రక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే 10 వేలమంది పారామిలటరీ సభ్యులు మైదానంలో పహారాగా ఉంటారు. ఇక ఢిల్లీలోని ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలు, టూరిస్ట్ ప్రదేశాలు, విద్యుత్ స్టేషన్ల వద్ద ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి