సగ్గుబియ్యం బూందీ

గురువారం, 8 జనవరి 2009 (18:06 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
సగ్గుబియ్యం... పావుకేజీ
జీడిపప్పు... 50 గ్రాములు
ఉప్పు... ఒక చెంచా
కరివేపాకు... రెండు రెబ్బలు
నూనె... పావు కేజీ
కారం... ఒక టీస్పూన్
జీలకర్ర పొడి... అర టీస్పూన్

తయారీ విధానం :
సగ్గుబియ్యాన్ని శుభ్రం చేసుకుని, గంటసేపు నీటిలో నానబెట్టాలి. తరువాత తెల్లటి కాటన్ గుడ్డమీద వేసి, నీడలో ఆరబెట్టాలి. అరగంటసేపు ఆరిన తరువాత పొడిపొడిగా ఉన్న సగ్గుబియ్యాన్ని ఒక ప్లేటులోకి తీసుకోవాలి.

స్టవ్‌పై కళాయి పెట్టి, పావుకేజీ నూనెను పోసి బాగా మరగనివ్వాలి. ఒక పిడికెడు సగ్గుబియ్యం మరుగుతున్న నూనెలో వేసి బాగా కలియబెట్టాలి. వీటిని బంగారు వర్ణం వచ్చేదాకా బాగా వేయించి తీసేయాలి.

అలా సగ్గుబియ్యం మొత్తాన్ని వేయించి ఒక పళ్ళెంలో పోసుకుని.. కరివేపాకు, జీలకర్రపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అంతే సగ్గుబియ్యం బూందీ రెడీ అయినట్లే..! సాయంకాలాల్లో ఇవి చిన్నపిల్లలకు పెడితో ఇష్టంగా తింటారు.

వెబ్దునియా పై చదవండి