"ఉసిరి మురబ్బా"లో విటమిన్ 'సి' పుష్కళం..!

కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు.. ఒక కేజీ
మంచినీరు.. అర లీ.
పంచదార.. రెండు కేజీలు
పటిక.. కాస్తంత
సిట్రిక్ యాసిడ్.. రెండు టీ.
యాలకుల పొడి.. అర టీ.

తయారీ విధానం :
తాజా ఉసిరికాయల్ని బాగా కడిగి ఫోర్క్‌ లేదా చాకుతో అన్నివైపులా గాట్లు పెట్టాలి. వీటిని పటిక కలిపిన నీటిలో రెండుమూడు నిమిషాలుంచి తీయాలి. ఆపై బాగా మరిగించిన నీటిలో మరో మూడు నిమిషాలు ఉంచి తీసి వెంటనే చల్లటి నీటిలో వేయాలి. ఇప్పుడు పంచదారలో నీళ్లు పోసి సిట్రిక్‌యాసిడ్‌ వేసి రెండుమూడు నిమిషాలు మరిగించాలి. తరువాత ఉసిరికాయల్ని కూడా వేసి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి.

చివరగా యాలకులపొడి వేసి దించి, చల్లారాక సీసాలో భద్రపరచుకోవాలి. అంతే ఉసిరి మురబ్బా సిద్ధమైనట్లే..! ఉసిరికాయల్లో విటమిన్ సి. పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలు, గింజలు, ఆకులు, పువ్వులు, వేళ్ళు, బెరడులను ఆయుర్వేద ఔషధాలలో వాడుతారు. ముఖ్యంగా చ్యవనప్రాశ్‌లో వాడతారు. మలబద్ధకానికి ఉసిరికాయ దివ్యౌషధం. షాంపూలలో కూడ ఉసిరి కాయలను వాడుతుంటారు.

వెబ్దునియా పై చదవండి