కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు.. పావు కేజీ ఛాట్ మసాలా.. రెండు టీ. కొత్తిమీర.. తగినంత మిర్చిపొడి.. సరిపడా ఉప్పు.. తగినంత చింతపండు చట్ని.. రెండు టీ. పెరుగు.. రెండు టీ. ఉల్లిపాయ.. ఒకటి టొమోటో.. ఒకటి పచ్చి మిర్చి.. రెండు సన్నటి కారంపూస.. ఒక కప్పు ఉడికించిన శెనగలు.. 50 గ్రా.
తయారీ విధానం : బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించి చిన్న సైజు ముక్కలుగా కట్ చేయాలి. గిన్నెలో బంగాళాదుంప ముక్కలకి చింతపండు చట్నీ, ఛాట్ మసాల, తరిగిన కొత్తిమీర, మిర్చి పొడి, పెరుగు, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, కారంపూస, ఉడికించిన శెనగలు వేసి మిశ్రమాన్ని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్స్‌లో సర్ది పైన కొంత పెరుగు వేసి ఆపై అతిథులకు అందించాలి.