కావలసిన పదార్థాలు : పాలకూర.. 3 కట్టలు పచ్చిమిర్చి.. 4 అల్లం తరుగు.. ఒక టీ. వెల్లుల్లి తరుగు.. రెండు టీ. కార్న్‌ఫ్లోర్.. ఆరు టీ. మైదా.. 4 టీ. మిరియాలపొడి.. అర టీ. అజినమోటో.. పావు టీ. పంచదార.. అర టీ. బాదం.. నాలుగు ఉప్పు.. తగినంత
తయారీ విధానం : పాలకూరను కడిగి సన్నగా తరగాలి. అందులోనే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు వేసి కలపాలి. ఓ బాణలిలో నూనె పోసి ఈ పాలకూర మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా తీసుకుని పకోడీల మాదిరిగా వేయించాలి. విడిగా మరో బాణలిలో ఒక టీస్పూను నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, అజినమోటొ, ఉప్పు, మిరియాలపొడి వేసి పైన వేయించిన పాలకూర పకోడీలను కూడా వేసి కలిపి దించాలి. చివరగా బాదం ముక్కలతో అలంకరించాలి. అంతే క్రాకిలింగ్ పాలక్ సిద్ధం..!
పాలకూరను నీళ్లలో బాగా ఉడకబెట్టి ఆకును పిండి, ఆ రసం తలకు బాగా పట్టించి అరగంట పాటు ఉంచాలి. దీనివలన తలలో చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ నీటితో రాత్రి పడుకోబోయే ముందు, ముఖం, మెడ భాగం వరకూ కడుకుంటే ముఖ సౌందర్యం వృద్ధి చెందుతుంది.