కావలసిన పదార్థాలు : వంకాయలు... 100 గ్రాములు మిరియాల పొడి... ఒక టీస్పూన్ జీలకర్ర పొడి... ఒక టీస్పూన్ ఎండు మిర్చి పొడి... రెండు టీ స్పూన్లు టమోటా... ఒకటి చింతపండు... రసానికి తగినంత ఇంగువ పొడి... చిటికెడు పసుపు పొడి... చిటికెడు
తయారీ విధానం : లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కాస్తం నూనె వేసి అందులో మిరియాల పొడి, జీలకర్రపొడి, పసుపు, ఇంగువ పొడులతో పోపు పెట్టాలి. అందులో చింతపండు రసం పోసి కావల్సినంత ఉప్పు చేర్చాలి. (చింతపండు రసం ఎక్కువగా వద్దు అనుకునేవారు టమోటా రసాన్ని చేర్చుకోవచ్చు) తరువాత వేయించి పక్కనపెట్టుకున్న వంకాయ ముక్కలు, కొత్తిమీర తరుగులను కూడా రసంలో చేర్చి, పొంగు వచ్చేదాకా ఉడికించి దించేయాలి. అంతే వంకాయ రసం రెడీ.