వానాకాలం హెల్దీ ట్రీట్ "కాశ్మీరీ కెహవ"

FILE
కావలసిన పదార్థాలు :
గ్రీన్ టీ పౌడర్.. 4 టీ.
మంచినీళ్లు.. నాలుగు కప్పులు
కుంకుమపువ్వు.. పావు గ్రా.
యాలకులు.. రెండు
దాల్చినచెక్క పొడి.. పావు టీ.
బాదంపప్పు... ఎనిమిది

తయారీ విధానం :
మంచినీటిలో గ్రీన్‌ టీ పొడి వేసి అయిదు నిమిషాలు మరిగించాలి ఒక పొంగు రాగానే దానిని వడగట్టాలి. ఈ డికాక్షన్‌ను సన్నటి మంటమీద ఉంచాలి. ఇందులో కుంకుమ పువ్వు, యాలకులు, దాల్చినచెక్క, బాదంపప్పు వేసి కలియబెట్టాలి. బాగా మరిగిన తరువాత కప్పుల్లో పోసి అందించాలి. అంతే కాశ్మీరీ కెహవ సిద్ధం..! చలిలో వెచ్చదనానికి, ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మీరూ ట్రై చేసి చూడండి.

వెబ్దునియా పై చదవండి