పన్నీర్ మంచూరియన్ రెసిపీ తయారీ ఎలా?

శుక్రవారం, 22 జనవరి 2016 (10:28 IST)
పన్నీర్ అంటే ఇష్టపడని వారుండరు. పాలతో చేసిన పన్నీర్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు పన్నీర్ మంచూరియన్ ఎలా చేయాలో తెల్సుకుందాం!
 
కావలసినపదార్థాలు:
 
కార్న్‌ఫ్లోర్ - అరకప్పు
సోయా సాస్ - 2 స్పూన్లు
పన్నీర్ - 1 కప్పు
ఉల్లిపాయలు - 1/2 కప్పు తరిగినవి
మైదా పిండి -  2 స్పూన్లు
ఉల్లికాడలు - 1/2 కప్పు తరిగినవి
నూనె - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - తగినంత
సోయా సాస్ - తగినంత
నూనె - తగినంత
ఉప్పు - తగినంత 
 
వేయించడానికి:
 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - తగినంత 
పచ్చిమిర్చి - 5 తరిగినవి
టొమాటో సాస్ - తగినంత
చిల్లీ సాస్ - 2 స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
 
తయారుచేయు విధానం:
 
పన్నీర్‌ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పోయాక ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, ఉప్పు కొంచెం నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. పన్నీర్‌ ముక్కలు కూడా చేసి కలపాలి. 
ఇప్పుడు స్టౌ మీద పాత్ర పెట్టి, అందులో నూనె పోసి వేడి అయ్యాక, కొద్దికొద్దిగా పిండి తీసుకుని పకోడీలు లాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పాత్రలో కొంచెం నూనె పోసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, వేసి వేయించాలి. వేగాక సోయాసాస్, చిల్లీ సాస్,వేయించిన మంచూరియాలు, తగినంత ఉప్పు, ఉల్లికాడల తరుగు వేసి బాగా కలపాలి. చివరగా టొమాటో సాస్ వేస్తే వేడివేడి పన్నీర్ మంచూరియన్ రెడీ. ఉల్లికాడలతో అలంకరించుకుంటే ఇంకా బాగుంటుంది.
 

వెబ్దునియా పై చదవండి