చింతకాయ తొక్కు చేద్దాం రండి

శనివారం, 3 అక్టోబరు 2020 (23:01 IST)
చింతకాయలోని పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. విత్తనాల సారం రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే చింతపండు పులుసు శరీర బరువు తగ్గడానికి, కొవ్వు కాలేయ వ్యాధిని రివర్స్ చేయడానికి సహాయపడుతుంది. చింతపండు తొక్కును ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
చింతకాయలు- పావు కేజీ
పచ్చిమిర్చి- 75 గ్రా.
తాజా కొత్తిమీర- ఒక కట్ట
జీలకర్ర- ఒక టీ స్పూన్.
ధనియాలు- 2 టీస్పూన్లు.
వెల్లుల్లి- ఒక టీస్పూన్.
అల్లం- చిన్న ముక్క
ఉప్పు- తగినంత
ఎండుమిర్చి- మూడు
ఆవాలు- కాసిన్ని
 
తయారీ విధానం :
చింతకాయల్ని బాగా కడిగి ఆరాక, పక్కలనుండే ఈనెల్నీ.. లోపలున్న గింజల్నీ తీసి ఆరబెట్టాలి. పచ్చిమిర్చిని వేయించి చల్లారాక పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, చింతకాయ ముక్కలు, కొత్తిమీరలను కలిపి మెత్తగా రుబ్బాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు చేసి పచ్చడిలో కలపాలి. చింతకాయలకు బదులు చింతపండు, పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా కారం వేసి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. అంతే నోరూరించే చింతకాయ పచ్చడి సిద్ధమైనట్లే..!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు