కావలసిన పదార్థాలు : గోంగూర.. ఒక కట్ట కందిపప్పు... ఒక కప్పు ఉల్లిపాయలు... రెండు పోపు సామాను... సరిపడా పచ్చిమిర్చి... నాలుగు ఎండు మిర్చి... నాలుగు ఉప్పు.... తగినంత కారం, పసుపు, ఇంగువ... సరిపడా
తయారీవిధానం : ముందుగా గోంగూరను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు కడిగి కావలసినంత నీరు పోసి అందులో గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి.. కుక్కర్లో ఉడికించి దించేయాలి. తర్వాత ఉడికిన పప్పులో పసుపు, ఉప్పు, కారం కలపాలి.
చివరిగా... బాణలిలో నూనె పోసి పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టి.. పప్పులో కలిపి ఒక నిమిషం ఉడికించి దించేయాలి. అంతే గోంగూర పప్పు రెడీ అయినట్లే...! ఈ గోంగూర పప్పును వేడివేడి అన్నంతోను, చపాతీలతోనూ తీసుకుంటే చాలా బాగుంటుంది.