తినసొంపైన డిష్ "డ్రమ్‌స్టిక్స్ మసాలా"

FILE
కావలసిన పదార్థాలు :
మునక్కాయలు.. నాలుగు
పచ్చిమిర్చి.. ఎనిమిది
ఉల్లిపాయలు.. ఎనిమిది
అల్లంవెల్లుల్లి పేస్ట్.. రెండు టీ.
నూనె.. రెండు టీ.
కారం.. రెండు టీ.
గరంమసాలా... ఒక టీ.
పసుపు.. అర టీ.
ఉప్పు.. తగినంత
కొత్తిమీర.. పెద్ద కట్ట

తయారీ విధానం :
మునక్కాయలను చిన్న ముక్కలుగా చేయాలి. వాటిలో కొద్దిగా నీటిని పోసి పసుపు, ఉప్పు వేసి ఓ మోస్తరుగా ఉడికించి పక్కనుంచాలి. బాణలిపెట్టి నూనె వేసి కాగిన తరువాత పోపు దినుసులన్నింటినీ వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించి, ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలియబెట్టాలి. కాసేపయ్యాక సగం ఉడికించిన మునక్కాయ ముక్కల్ని వేసి కలపాలి.

కాయలకు మసాలా బాగా పట్టేటట్లుగా సన్నటి మంటమీద కలియబెడుతూ ఎర్రగా అయ్యేంతదాకా ఉడికించాలి. చివర్లో గరంమసాలా పౌడర్ వేసి దించాక తరిగిన కొత్తిమీర చల్లి వడ్డించాలి. ఇష్టమైనవాళ్లు గరంమసాలా చల్లిన తరువాత కొబ్బరి తురుముగానీ, క్యారెట్ తురుముగానీ చల్లుకోవచ్చు. ఈ కూరను పొడి పొడిగా చేయవచ్చు. గ్రేవీ కావాలనుకునేవారు మసాలా మోతాదు పెంచి మునక్కాయల్ని ఉడికించిన నీటిని కలుపుకుంటే సరిపోతుంది. అంతే డ్రమ్‌స్టిక్స్ మసాలా రెడీ..!

వెబ్దునియా పై చదవండి