కర్టెన్లతో గృహ సౌందర్యం

మహిళలు సౌందర్య ప్రియులన్న సంగతి అందరికీ తెలిసిందే...! వారి సౌందర్య ప్రియత్వం వస్త్ర ధారణ, ఆభరణాలకు మాత్రమే పరిమితం కాదు. తమ ఇంటిలోని ప్రతి స్థానం ఎప్పుడూ క్రొత్తగా, అందమైన అలంకరణతో ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం నిత్యం క్రొత్త ఆలోచనలకు పదును పెడుతుంటారు.

గృహంలోపల వివిధ గదులకు వివిధ రకాలైన గదులకు పలు విధాలైన కర్టెన్లను అమర్చవచ్చు. తద్వారా గృహం ప్రకాశిస్తుంది. ఇంటిలోపల సింహద్వారాని ఉండే తెర ఆకర్షించే విధంగా ఉండాలి. ఇంటి లోపలి గుమ్మాలు, కిటికీలకు అమర్చే కర్టెన్లులు కాస్త మందంగా ఉండాలి.

పూజ గదికి అమర్చేటువంటి తెర మంగళకరంగా ఉండడం అవసరం. అందుచేస పుసుపు, ఎరుపు వంటి రంగులను ఎంపిక చేసుకోండి. బాత్‌రూంకు ఉండే కర్టెన్లను మాత్ర చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఈ కర్టెన్లను అప్పుడప్పుడూ మార్చుతూ ఉండాలి. దీనికోసం ప్రతిసారి క్రొత్తవి కొనవలసిన అవసరం లేదు. ఒక గదిలోని కర్టెన్‌ను వేరే గదికి, మరొక గది కర్టెన్‌ను వేరొక గదికి మార్చడం ద్వారా కొత్తదనాన్ని ఆస్వాదించవచ్చు.

వెబ్దునియా పై చదవండి