గృహాలంకరణకు సువాసనలు వెదజల్లే పుష్పాలు

గృహమే కదా స్వర్గసీమ అన్నారు మన పెద్దలు. గృహాన్ని అందంగా అలంకరించుకోవాలని చాలా మంది మహిళలు ప్రయత్నిస్తుంటారు. తమతమ అభిరుచులకు తగ్గట్టు వారి వారి ఇళ్లను, గదులను అలంకరిస్తుంటారు. వాటిలో ముఖ్య పాత్ర పోషించేది కర్టెన్లు, కార్పెట్లు, అక్కడ అక్కడ అమర్చే ఫ్లవర్ వాజ్‌లు.

గృహంలోని అన్ని గదుల్లో మనసుకు నచ్చిన పుష్పాలను అలంకరించడం ద్వారా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతాం. మన దగ్గర పెద్ద వాజ్‌లు లేకపోయినప్పటికీ, చిన్న కుండలో నీళ్లు పోసి రోజాలు, లిల్లీలను అలంకరించుకోవచ్చు.

గృహంలో ఉన్న ప్రతి గది గుమ్మానికి అందమైన చాంమతి, బంతి పూవ్వులను తోరణాలుగా కట్టడం కూడా అందగిస్తుంది. ముఖ్యంగా పడక గదిలో నచ్చిన పువ్వులను అమర్చుకోవడంతో చికాకులు, ఆందోళనలు వదిలి మనసు ప్రశాంతంగా మారుతుంది.

అంతేకాకుండా వివిధ రకాల పుష్పాలను హాల్‌ల్లో అలంకరించడం ద్వారా వచ్చే అతిథులను ఆకర్షిస్తుంది. గృహంలోని కొన్ని మూళల్లో మీకు నచ్చిన సుగంధద్రవ్యాన్ని కొంత నీటిలో కలిపి ఆ నీటిలో మీకు నచ్చిన పుష్పాలను అలంకరించడం ద్వారా గృహమంతా నందనవనంగా మాత్రమే కాకుండా సుగంధభరితంగా కూడా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి