ఇంటి కిటికీలకు ఎలాంటి కర్టెన్లు వాడుతున్నారు..?

గురువారం, 15 మే 2014 (17:17 IST)
File
FILE
* ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటి కిటికీలు, తలుపులకు వాడే కర్టెన్లు పాలిస్టర్, కాటన్, ఆర్గాంజ్, సింథటిక్, జనపనార, సిల్కు వంటి బట్టలతో తయారైన వాటిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇలాంటి కర్టెన్లలో బట్ట ఒక వరుసే ఉండటం వల్ల ఎండను నిరోధించటంతోపాటు, బయటి దృశ్యాలను కనబడకుండా చేస్తాయి.

* ప్రైవసీతో పాటు బయటి దృశ్యాలను చూసేందుకు వీలుగా ప్రస్తుతం 'డే షీర్' అనే కర్టెన్లు మార్కెట్లో లభిస్తాయి. సాధారణ కర్టెన్ల మాదిరిగా కాకుండా షీర్ కర్టెన్లలో బట్ట సన్నగా ఉంటుంది. వీటిల్లో కూడా అనేక డిజైన్లు లభిస్తున్నాయి. వీటిలో థ్రెడ్ కర్టెన్లు మంచి ఉపయోగకరంగా ఉంటాయి. అవసరాన్ని బట్టి, ప్రధాన కర్టెన్‌ను తీసివేసి, షీర్ కర్టెన్‌ను మాత్రమే వాడుకునే సౌలభ్యం ఉంటుంది.

* పాలిస్టర్ బట్టతో తయారయ్యే థ్రెడ్ పరదాలను అవసరాన్ని బట్టి ఒకటి, రెండు రంగులతో ఎంచుకోవచ్చు. దారాల మధ్య చిన్న, పెద్ద పూసలతో కూడా ఇవి లభిస్తున్నాయి. వీటిని కిటికీలతో పాటు తలుపులకు కూడా వాడవచ్చు. షీర్ పరదాలు ఇళ్లలో ఫ్రెంచి విండోలు, డ్రాయింగ్ రూం లాంటి వాటికి చక్కగా నప్పుతాయి. కిటికీల్లోంచి సాయం సంధ్యవేళల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అవి అనువుగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి