నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారా..? ఇవిగోండి జాగ్రత్తలు!

నాన్‌స్టిక్ పాత్రలను అధిక వేడిపై ఉపయోగించకూడదు. మితమైన హీటే సరిపోతుంది. ఎక్కువ సేపు స్టౌ మంటపై నాన్ స్టిక్ పాత్రలను ఉంచకూడదు. అలా ఉంచితే.. ఆ వస్తువుల్లో పూసిన కోటింగ్ వృధా అవుతుంది. నాన్ స్టిక్ వస్తువులను తుడిచేటప్పుడు మృదువైన కాటన్ లేదా స్పాంజ్‌లను ఎంచుకోవడం మంచిది.

శుభ్రపరిచేటప్పుడు సోప్ పౌడర్‌ను మాత్రమే ఉపయోగించాలి. షార్ప్‌గా ఉన్న గరిటెలు, కత్తులను నాన్‌స్టిక్ పాత్రల్లో ఉపయోగించకూడదు. వుడ్ స్పూన్లు ఉపయోగించడం ఎంతో మేలు. నాన్ స్టిక్ పాత్రల కంటూ ప్రత్యేక కపోర్డ్‌ను కేటాయించుకోవాలి.

నాన్ స్టిక్ పాత్రలు మరకైనట్లు కనిపిస్తే.. ఆ పాత్రలో సగం నీరు పోసి.. అందులో ఒక స్పూన్ బ్లీచింగ్ పౌడర్‌ను కలపాలి. కాస్త వెనిగర్ కూడా చేర్చి మితమైన వేడిపై పది నిమిషాల పాటు ఉంచి.. మరకలున్నచోట గరిటెతో గట్టిగా రుద్దితే సరిపోతుంది. తర్వాత సోపు నీటిలో శుభ్రం చేసి, నూనె రాసి ఉపయోగించుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి