బాత్‌రూమ్‌లు అందంగా, సౌకర్యంగా...!

Ganesh

శుక్రవారం, 23 జనవరి 2009 (20:10 IST)
FileFILE
ఈరోజుల్లో సొంతిల్లు కట్టుకోవడం గగనమైపోయిన సంగతి తెలిసిందే. ఎంతో కష్టపడి కట్టుకున్న, చిన్న ఇళ్లల్లో... తక్కువ స్థలంలో నిర్మించిన బాత్‌రూమ్‌లను కూడా సౌకర్యంగా మలచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఇందుకోసం కింది చిట్కాలను పాటించినట్లయితే ఎప్పుడూ ప్రియమైన ఈ స్థలాన్ని మరింత ఆకర్షణీయంగా చేసుకోవచ్చు.
పార్టిషన్ చేస్తే...!
  షవర్‌ ఏర్పాటు ప్రత్యేకంగా ఉండాలనుకునేవారు అద్దం లేదా అక్రిలిక్ షీట్‌తో బాత్‌రూమ్‌‌లో పార్టిషన్ ఏర్పాటు చేస్తే స్థలం కూడా వృధా కాకుండా ఉండటమే కాకుండా, ఇరుకుగా అనిపించదు...      


తక్కువ స్థలంలో నిర్మించే బాత్‌రూమ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముదురు రంగులను ఎంచుకోకూడదు. గోడలకు ఎప్పుడూ లేత రంగులో ఉండే టైల్స్‌నే వేయించుకోవాలి. తలుపులు, కిటికీలు, క్యాబినెట్స్‌లకు ఆహ్లాందగా ఉండే లేత రంగులను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

తెల్లటి కాంతినిచ్చే బల్బులను అమర్చితే... ఆ విద్యుత్ కాంతుల వెలుగులో చిన్నగా ఉండే బాత్‌రూమ్‌‌ విశాలంగా కనిపిస్తుంది. వాష్ బేషిన్లు వాడటం ఆధునికంగా, ఉపయోగకరంగా ఉండటం మాత్రమే కాకుండా... వాటిని తక్కువ స్థలంలో అమర్చగలిగే విధంగా ఉంటే మంచిది.

అక్రిలిక్ షీట్ లేదా మార్బుల్స్‌తో బాత్‌రూమ్‌ మూలల్లో అరల్లాగా నిర్మించుకోవాలి. వీటిలో సబ్బు, షాంపూలు, ఇతర వస్తువులను పొందికగా అమర్చుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

షవర్‌ ఏర్పాటు ప్రత్యేకంగా ఉండాలనుకునేవారు అద్దం లేదా అక్రిలిక్ షీట్‌తో బాత్‌రూమ్‌‌లో పార్టిషన్ ఏర్పాటు చేస్తే స్థలం కూడా వృధా కాకుండా ఉండటమే కాకుండా, ఇరుకుగా అనిపించదు.

అలాగే... బాత్‌రూమ్‌‍లో వస్తువులను ఎక్కడపడితే అక్కడ అలాగే వదిలివేయకూడదు. అలా వదిలివేస్తే గది ఇరుకుగా తయారవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా వస్తువులను అక్కడి నుండి తీసివేయటమే గాకుండా... బాత్‌రూమ్‌‍‌లో తప్పకుండా ఉండాల్సిన వస్తువులను నీట్‌గా సర్దుకుంటే... చిన్నదైనప్పటికీ సౌకర్యంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి