వాల్‌ పోస్టర్లతో గృహాలంకరణ

గృహానికి మెరుగైన, ఆకర్షణీయమైన అందాన్నిచ్చేవి వాల్ పోస్టర్లు. గృహంలోని వివిధ గదుల గోడలకు అంటించే వాల్ పోస్టర్లు ఆ గృహంలో నివసించే వారికి ఉత్సాహాన్ని పెంపొందింప చేస్తాయి. గృహంలోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా స్వాగతం పలికే విధంగా కనిపించే వాల్‌పోస్టర్‌ను ఎంచుకుంటే బాగుంటుంది.

గృహంలోని ప్రధానగది (హాల్‌)లో గోడలకు అందాన్నిచ్చే ఆకర్షణీయ ప్రకృతి సౌందర్యాలను వెలిబుచ్చే సీనరీలను వాల్ పోస్టర్లుగా అంటిస్తే హాలు అథిదులను ఆకర్షిస్తుంది. వీటికి తోడుగా ప్లవర్ వాజ్‌ల్లో పలు రకాలైన పుష్పాలను అలంకరించుకుని టేబుళ్లపై, లేదా గదుల మూల ప్రదేశాల్లో ఉంచితే గదికి మరింత అందం చేకూరుతుంది.

పడక గదిలో ప్రేమ చిహ్నాలను, ప్రణయ గాధలను వళ్ళించే విధంగా ఉండే వాల్‌పోస్టర్లను అమర్చడం ద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళనలు తొలగి మనసును నిర్మలంగా ఉంచడమే కాకుండా మంచి నిద్రను కూడా అందిస్తుంది. అదే పిల్లల పడక గదుల్లోనైతే వారికి నచ్చిన కార్టూన్లు, బొమ్మల వాల్‌పోస్టర్లను అమర్చవచ్చు.

వంట గది గోడలకు నచ్చిన, పౌష్ఠిక ఆహారాన్ని అందించే పండ్లు, కూరగాయలు, ఆహార వాల్ పోస్టర్లను ఉంచవచ్చు. ఇక పోతే రీడింగ్ రూమ్, లైబ్రరీలను కలిగి ఉండే గదుల్లోని గోడలకు విజయ సాధనకు స్ఫూర్తినిచ్చే సూక్తుల వాల్‌పోస్టర్లను ఉంచడం ఉత్తమం.

వెబ్దునియా పై చదవండి