రంగులతో పడకగదిని పరవశింపచేయాలంటే?

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (14:51 IST)
* భావోద్వేగాన్ని, మనోహర భావాన్నీ కలిగించడానికి పడక గదికి వజ్ర వర్ణానికి సంబంధించిన గాఢమైన రంగులు వేయడం మేలు. 
 
* లేత వర్ణాల కన్నా పడకగది అలంకరణలో చిక్కని రంగులు వేయడం వల్ల ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆధునిక యుగంలో హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. కాకపోతే గాఢమైన వర్ణాలు విశాలమైన ఖాళీలు ఉన్నచోటే బావుంటాయి. గ్రే, బ్రౌన్‌ రంగులు వర్ణ మిశ్రమానికి అదనపు ఆకర్షణగా ఉంటాయి.
 
* గాఢమైన ఏ రంగులైనా తెలుపు రంగుతో ఇట్టే మ్యాచ్ అవుతాయి. ప్రత్యేకించి, పింక్, మెరూన్, గోల్డ్ రంగులు బాగుంటాయి. ఎరుపు, పసుపు వంటి బ్రైట్ కలర్స్‌ను కాస్త ఆరెంజ్ రంగును మేళవించిన రంగులు ఉదయం వేళ మేలుకునే సమయంలో ఇవి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి. 
 
* పసుపు, ఆరెంజ్ వంటి రంగుల కలయికతో కాస్త బ్రౌన్ రంగు కూడా కలిస్తే అది కొంత వైవిధ్యంగా ఉంటుంది. నీలి, ఆకుపచ్చ వర్ణాలు మనసును బాగా శాంతపరుస్తాయి. అదే సమయంలో మనసును అలజడికి గురిచేసే వర్ణాలకు దూరంగా ఉంచాలి. నీలి, ఆకుపచ్చ వర్ణాలు పడకగదికి ఒక మృదువైన భావాన్ని కలిగిస్తాయి. ఇవి చిన్న గదుల్ని కూడా విశాలంగా అనిపించేలా చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి