పసుపు, వేపాకు, ఉప్పు, నిమ్మతో ఫ్లోర్ క్లీనర్- తయారీ ఇలా?

గురువారం, 27 జులై 2023 (19:19 IST)
Floor cleaner with turmeric, neem, salt, lemon
పసుపు, వేపాకు, ఉప్పుతో ఫ్లోర్ క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. పసుపు, వేపాకు, ఉప్పు, నిమ్మకాయ క్రిమి సంహారకాలు. వీటిని ఉపయోగించి ఫ్లోర్ క్లీనర్ ఎలా చేయాలంటే.. 
 
ముందుగా వేపాకు గుప్పెడు, ఉప్పు గుప్పెడు, నిమ్మకాయలు పది, పసుపు రెండు స్పూన్లు తీసుకుని మిక్సీలో బాగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు నీరు చేర్చుకోవాలి. ఆపై మిక్సీ  పట్టుకున్న మిశ్రమాన్ని వడకట్టి ఓ బాటిల్‌లోకి తీసుకుంటే ఫ్లోర్ క్లీనర్ రెడీ. ఈ ఫ్లోర్ క్లీనర్‌ సహజసిద్ధమైంది. 
 
భారీ ఖర్చు చేసి ఫ్లోర్ క్లీనర్స్ కొనేకంటే ఇంట్లోనే ఇలా సహజ సిద్ధంగా ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకుంటే... ఇంట్లో ఎలాంటి క్రిములను దరిచేర్చకుండా... ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు