మొక్కలను కుండీలలో ఎలా పెంచాలి..?

శుక్రవారం, 11 జనవరి 2019 (18:06 IST)
కుండీలలో మొక్కలు పెంచడం నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కుండీలలోని మొక్కలకు ఏ మోస్తరు నీరు పోయాలనేది అప్పుడప్పుడు సమస్యగా ఎదురవుతుంది. నీరు తక్కువైతే మొక్క ఎండి పోతుంది. నీరు ఎక్కువైతే కుళ్ళిపోతుంది. అయితే విషయం ఆలస్యంగా బయటపడుతుంది. అప్పటికి మొక్కను తిరిగి బతికించే అవకాశముండదు.
 
మొక్కకు ఏ మాత్రం నీరు పోయాలి అనేది ఆ మొక్కను మీరు ఎక్కడ ఉంచుతారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. వేడి అధికంగా ఉండే గదిలో పెట్టే మొక్కకు ప్రతిరోజూ కొద్దిగా నీరు పోయాలి. ఆరుబయట రాక పోర్టికోలో ఉండే మొక్కలకు రెండు రోజులకు ఒకసారి పోస్తేచాలు.
 
కుండీని చేతితో ఎత్తి చూడడం ద్వారా లోపల నీరు ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు. కుండీ లోపం పెంకులు, ఇసుక మట్టి ఉంచితే కుండీలో పోసిన అధిక నీటిని పీల్చుకుంటుంది. కుండీ కింద మట్టి ప్లేటుంచితే అధికంగా పోసిన నీరు బయటకు వచ్చి అందులో చేరుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు