బంధుమిత్రులు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి?

శుక్రవారం, 13 మార్చి 2015 (18:56 IST)
ఇంటికెవరైనా వస్తే ఇల్లంతా కళకళలాడుతూ సందడిగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇంటిని మరింత పొందిగ్గా వుంచితే వచ్చిన వారికి, ఇంట్లోని వారికి కూడా ఆహ్లాదంగా, హాయిగా వుంటుంది. ఇంటిని తుడిపించే సమయంలో నీటిలో కొద్ది చుక్కలు సువాసనభరితమైన నూనెను కలపాలి. ఇల్లంతా పరిమళాలతో నిండిపోతుంది. పమగ్రనైట్ ఆయిల్ అయితే తాజాగా ఉంటుంది. పడక పక్కనుండే టేబుల్ మీద సెంటెడ్ క్యాండిల్ అమర్చుకోవాలి. 
 
పరిశుభ్రమైన టవల్స్‌ను అందుబాటులో వుంచితే అతిథులు అడగాల్సిన పనిలేకుండా స్వంత ఇంట్లో మాదిరి పూర్తి సౌకర్యంగా ఫీలవుతారు. గదులన్నింటినీ చిందరవందరగా లేకుండా శుభ్రంగా సర్దేయాలి. పడుకోవడానికి, కూర్చోవడానికి వచ్చినవారు ఇబ్బందిపడకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంవల్ల వారు మొహమాట పడకుండా రిలాక్సవుతారు. వాజ్ పూలు సర్దడాన్ని మరిచిపోవద్దు.

వెబ్దునియా పై చదవండి