ఆభరణాలను ఎలా శుభ్రం చేస్తున్నారు?

శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (19:00 IST)
ఆభరణాలను ఫంక్షన్లకు అందంగా అలంకరించుకెళ్లడం ఒక కళైతే.. ఆభరణాలను వన్నె తగ్గకుండా ఉపయోగించడం కూడా మరో కళే. రోజూ వేసుకునే ఆభరణాలను వారానికి రెండు సార్లు, ఎప్పుడో ఒకప్పుడు వేసుకునే నగల్ని వేసి తీసిన తర్వాతే శుభ్ర పరచి పెట్టేయడం చేయాలి. 
 
ఇంకా ఆభరణాల తయారీకి మృదువైన బ్రష్‌ను ఉపయోగించాలి. బ్రష్‌తో ఆభరణాలను శుభ్రం చేయడానికి ముందు దానిని 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉపయోగించాలి. దీని వల్ల బ్రష్ కుచ్చు మృదువుగా తయారవుతుంది. ఫలితంగా ఆభరణాలకు హాని కలగదు. ఐబ్రో బ్రష్, హెయిర్ డై బ్రష్‌లను ఆభరణాల శుభ్రతకు ఉపయోగించకూడదు.
 
ఆభరణాన్ని బ్రష్‌తో రుద్దుతున్నప్పుడు గోరువెచ్చని నీటిని పోస్తూ రబ్ చేస్తూ ఉంటే మురికి వదులుతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదు. అయితే, ఆభరణాలను అన్నింటినీ కలిపి కాకుండా విడి విడిగా శుభ్రపరచాలి.
 
రత్నాలు పొదిగి ఉండే ఆభరణాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచకూడదు. సబ్బు నీటిలో ముంచి, వెంటనే తీయాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ మృదువుగా రుద్దాలి. తర్వాత మెత్తని వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. ఆభరణం వెనకవైపు కూడా తడి లేకుండా తుడిచి, భద్రపరచాలి.

వెబ్దునియా పై చదవండి