గృహాన్ని శుభ్రం చేసుకోకపోతే.. జబ్బులు ఖాయం.. చిట్కాలివిగోండి!

శుక్రవారం, 4 మార్చి 2016 (10:55 IST)
గృహాన్ని తరచూ శుభ్రం చేసుకోకపోతే జబ్బులు ఖాయం. మన ఇంటిని తరచుగా శుభ్రం చేసుకోకపోతే అలర్జీలు తలెత్తుతాయి. అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాజరగకుండా ఉండాలంటే... శుభ్రత అనగానే స్నానాల గదినీ, టాయిలెట్‌నీ శుభ్రం చేయడానికి ఒక యాసిడ్‌ చాలు అనుకుంటున్నారేమో! మన ఇంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఈ క్లీనింగ్‌ కిట్‌ని సొంతంగా తయారుచేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ కిట్‌లో ఏమేమి ఉండాలంటే.. 
 
స్టెయిన్‌లెస్‌ స్టీలు కుళాయిలూ, సింకుల్ని శుభ్రం చేయడానికి ఒక స్పాంజిని ఎప్పుడూ ఉండాలి. టైల్స్‌పై పడిన మరకల్ని తొలగించడానికి ఒక ప్యాకెట్‌ బేకింగ్‌ సోడానీ ఈ కిట్‌లో చేర్చుకోవాలి. ఒకేసారి అన్ని గదులు శుభ్రం చేయాలంటే శ్రమగా అనిపిస్తుంది. రోజుకో గదిని శుభ్రం చేస్తే తేలికగా ఉంటుంది. ఏ గదిని శుభ్రం చేసినా కిటికీలు అన్నీ తెరిచి వెలుతురు వచ్చేట్టు చూసి అప్పుడు శుభ్రం చేయండి. అప్పుడే ధూళికణాలు బయటకు వెళ్లిపోతుంది.
 
పెయింట్లు వేసిన గోడలపై మరకలు పడితే... కొద్దిగా డిష్‌వాషర్‌ లిక్విడ్‌ కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి గోడపై తుడిస్తే మరకలు తొలగిపోతుంది. చెక్క వస్తువుల్ని అదేపనిగా....అతిగా నీటితో శుభ్రం చేస్తే అవి పాడవుతాయి. వీలైనంతవరకూ పొడివస్త్రంతో వాటిని శుభ్రం మంచిది.

వెబ్దునియా పై చదవండి