లివింగ్ రూమ్ లైటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి!

మంగళవారం, 6 జనవరి 2015 (17:45 IST)
లివింగ్ రూమ్ లైటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అంటున్నారు.. ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు. అతిథులు వచ్చినప్పుడు వారి దృష్టిని ఆకర్షించే లివింగ్ రూమ్‌ శుభ్రతకు తొలుత ప్రాధాన్యమివ్వాలి.

లివింగ్ రూమ్‌ ఫ్యామిలీతో సమయం గడపడానికి, ఫ్రెండ్స్‌తో అతిథులతో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రదేశం కావడంతో వెలుతురు సమానంగా ఉండేలా చూసుకోవాలి.
 
హాల్‌లో లైటింగ్‌పై ప్రత్యేక శ్రద్ద కనబరచాలి. మూడు లేదా నాలుగు కార్నర్స్ నుంచి లైటింగ్ పడే విధంగా ఎరేంజ్మెంట్స్ చేసుకోవాలి. డెకరేటివ్ ఐటెంని హైలైట్ చేసే విధంగా లైటింగ్ ఉండాలి. సాయంత్రం రిలాక్స్ అవడానికి డిమ్‌‌గా ఉండే లైట్లను‌ను ఏర్పాటు చేసుకోవాలని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి