మైక్రో ఓవెన్ వల్ల ప్రయోజనాలేంటి?

సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (17:30 IST)
మైక్రో ఓవెన్ వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీన్ని వాడే విధానం తెలుసుకుంటే ఎంతో సమయాన్ని, గ్యాస్‌నీ, డబ్బునీ ఆదా చేసుకోవచ్చు. రుచికరమైన పదార్థాలనూ తయారు చేసుకోవచ్చు. ఓవెన్‌లో చాక్లెట్‌ను రెండున్నర నిమిషాల్లోనే కరగబెట్టొచ్చు.
 
నిమ్మకాయలు, బత్తాయిలు, కమలా పండ్లు వంటి వాటిని రెండు నిమిషాల పాటు వేడి చేయడం ద్వారా రసం ఎక్కువగా వస్తుంది. ఇడ్లీ, రవ్వ, ఉప్మారవ్వ, వేరుసెనగపప్పు వంటి వాటిని వేడి చేసి, వేయించడం ద్వారా ఎక్కువ కాలం పురుగులు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు. 
 
తక్కువ సమయంలో బంగాళాదుంపల్ని ఉడికించవచ్చు. కొబ్బరి చిప్పల్లో కొబ్బరిని వేరు చేయడానికి అవసరమైన వేడి ఒకటి నుంచి రెండు నిమిషాల సమయం పడుతుంది.  

వెబ్దునియా పై చదవండి