రోజ్మేరీని చలికాలంలో పెంచండి.. దోమలకు చెక్ పెట్టండి!

మంగళవారం, 18 నవంబరు 2014 (19:07 IST)
రోజ్మేరీని చలికాలంలో పెంచండి.. దోమలకు చెక్ పెట్టండి. ఇదేంటి అనుకుంటున్నారా? రోజ్మేరీ మూలిక నూనె ఒక సహజమైన దోమల నివారిణిగా వ్యవహరిస్తుంది. రోజ్మేరీ మొక్క 4 నుంచి 5 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. 
 
అలాగే నీలం పువ్వులు కలిగి ఉంటుంది. రోజ్మేరీ మొక్క వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది. శీతాకాలంలో, ఈ మొక్క తట్టుకోవటానికి వెచ్చని నివాసం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఒక కుండలో రోజ్మేరీని పెంచి, శీతాకాలంలో మాత్రం ఇంట్లో ఉంచాలి. 
 
రోజ్మేరీని వంటలలో మసాలా కోసం వాడతారు. వెచ్చని నెలల్లో దోమలను నియంత్రించటానికి పెరటిలో రోజ్మేరీ మొక్క ఉంటే చాలు. అరకప్పు ఆలివ్ ఆయిల్‌లో నాలుగు చుక్కల రోజ్మేరీ సుగంధ తైలం కలిపి చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. దానిని అవసరమైనపుడు ఉపయోగించాలి.

వెబ్దునియా పై చదవండి