అల్మారలలో పుస్తకాలు ఎలా సర్దుతున్నారు?

శనివారం, 31 జనవరి 2015 (15:54 IST)
చదివిన పుస్తకాలను ఉంచడానికి ఇంట్లో అల్మరాలు ఎక్కువగా ఉండే గదిని కేటాయించుకోండి. అల్మరాలలో చదివిన పుస్తకాలను లోపలివైపు, చదవాల్సిన పుస్తకాలను బయటివైపు ఉంచుకుంటే తీసుకోవడం చాలా తేలిక అవుతుంది. ఇందులో ఇతర వస్తువులేవీ ఉంచకుండా జాగ్రత్తపడాలి.
 
ప్రతి పుస్తకం పేరు బయటకు కనిపించేట్లు అమర్చుకోవాలి. పుస్తకాలను తొందరగా గుర్గించే విధంగా...రచయిత లేదా విభాగాల పేరు కనిపించేలా ఏర్పాట్లు ఉండాలి.  ప్రతి పుస్తకం పేరు బయటకు కనిపించేట్లు అమర్చుకోవాలి.  
 
ప్రతి పుస్తకానికి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించి, పుస్తకం పేరు, సంఖ్యలను ఒక నోటు పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. దీని వల్ల ఏ పుస్తకం ఎక్కడుందో, మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వెంటనే తెలుస్తుంది. మీ దగ్గర పుస్తకాలు ఎక్కువగా ఉంటే ఈ పద్ధతి అనుసరిస్తే అవసరమైన బుక్ వెతుక్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి