మహిళలకు చిట్కాలు : సోఫాలు మన్నికగా ఉండేలా?

సోమవారం, 22 డిశెంబరు 2014 (13:31 IST)
సోఫాలు మన్నికగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. పిల్లలు సోఫాల మీద కూర్చుని హోమ్ వర్క్ చేస్తున్నప్పుడు సిరా మరకలు పడే ఆస్కారముంది. ఇలాంటప్పుడు గిన్నెలో  సోడా తీసుకుని అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపయ్యాక తీసి వాటితో తుడిస్తే మరకలు తగ్గుతాయి. 
 
కొందరు సోఫాపై పదార్థాలూ, మరకలు పడినప్పుడు నీళ్లలో ముంచిన వస్త్రంతో తుడుస్తారు. బ్రష్‌లతో రుద్దుతారు. దీనివల్ల మరకపోవడం అటుంచితే, తుడిచిన భాగం బరకగా తయారవుతుంది. 
 
రంగు వెలసిపోతుంది. ఫౌండేషన్, చాక్లెట్, నూనె, మరకలు సోఫాపై పడితే నిమ్మరసం చల్లి దూదితో తుడవాలి. అయినా తేమ ఉందనుకుంటే దానిమీద కాసేపు పేపరి పరిస్తే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి