చైనాతో స్నేహం చేద్దాం: పాకిస్థాన్

మంగళవారం, 10 నవంబరు 2009 (18:27 IST)
పాకిస్థాన్ దేశం చైనాతో స్నేహం చేస్తే చాలా మంచిదని, అమెరికాతో స్నేహం, అమెరికా నుంచి ఆర్థిక సహాయం పొందితే దేశానికే నష్టమని పాక్ శాస్త్ర, సాంకేతిక మంత్రి ఆజమ్ సవతీ అన్నారు.

అమెరికాతో స్నేహం కన్నా చైనాతో స్నేహ హస్తం అందుకుంటే దేశానికి చాలా మంచిదని, అమెరికా నుండి అర్థిక సహాయం అందుకుంటే అది పాకిస్థాన్ దేశానికే నష్టమని ఆయన అన్నారు.

అమెరికా సహాయం వలన దేశంలోని అన్ని సంస్థలను ఆ దేశం నష్ట పరుస్తుందని, కాబట్టి ఆ దేశం నుంచి ఎలాంటి సహాయం పొందకూడదని ఆయన తెలిపారు. దీనికి బదులుగా చైనాతో రాజకీయంగా, ఆర్థిక పరమైన అంశాల గురించి సంబంధాలను పెంచుకుంటే దేశంలోని ప్రజలను శాంత పరచవచ్చని ఆయన తెలిపారు.

తమ దేశంలో ప్రస్తుతం ఇంధన సమస్యను తొలగించేందుకు ఇరాన్ నుంచి గ్యాస్, ముడి చమురు తదితర వస్తువులను తీసుకోవాలని ఆయన సూచించారు.

చైనా దేశం తమకు చిరకాల మిత్ర దేశమని, ఆ దేశం తమ దేశాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తుందని, గ్యాస్, ముడి చమురు, ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి