పాక్ ప్రధాని గిలానీతో భేటీ సంతోషదాయకం : మన్మోహన్

గురువారం, 10 నవంబరు 2011 (12:16 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీతో భేటీ కావడం సంతోషదాయకంగా ఉందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం భారత్, పాకిస్థాన్ ప్రధానులు మాల్దీవులకు చేరుకున్నారు. ఈ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా వారిద్దరు భేటీ అయ్యారు.

వీరిద్దరి భేటీలో ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వాణిజ్యం, తీవ్రవాదం, ముంబై దాడుల కుట్రదారులపై చర్యల అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

ఈ భేటీ అనంతరం మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ గిలానీతో సమావేశ సమయంలో ఇరు దేశాల సంబంధాల పురోగతిపై సంతోషం వ్యక్తం చేసినట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి