బాగా పని చేయండి.. కానీ స్థిరపడకండి: గార్డన్ బ్రౌన్

మంగళవారం, 6 ఏప్రియల్ 2010 (14:50 IST)
FILE
బ్రిటీష్ ప్రభుత్వం కొత్త వీసా విధి విధానాలను రూపొందించుకుంది. ఇందులో భాగంగా విదేశస్తులు యూకేలో పని చేయొచ్చు, కాని ఇక్కడే స్థిర నివాసాలేర్పరచుకునే అవకాశాలు ఇకపై ఉండదు.

దేశంలో ఎన్నికల తేదీని ప్రకటించిన బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ మంగళవారం మాట్లాడుతూ తమ దేశంలో విదేశస్తులు ఇక్కడే స్థిరపడేందుకు వీలులేదని ఆయన తెలిపారు. తమ దేశంలో వచ్చే నెల ఆరవ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుందని ఆయన పేర్కొన్నారు.

ఇందులో భాగంగా విదేశీ ఉద్యోగస్థులకు విధి విధానాలను ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పరచిన కొత్త విధానాల్లో ప్రథమమైన టైర్ 1ననుసరించి భారతదేశానికి చెందిన గ్రాడ్యుయేట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అదే ఇదివరకు మాస్టర్ డిగ్రీలు చేసిన వారికి ప్రవేశం ఉంటుంది.

ఇకపై మాస్టర్ డిగ్రీలు చేసేవారికి తమ దేశంలో ఉద్యోగాలు చేసేందుకు ప్రవేశం ఉండదని ఆయన తెలిపారు. కాని తొలి వీసా కేవలం రెండు సంవత్సారల వరకే పరిమితమని ఆయన తెలిపారు. దీంతో స్వల్ప ఉద్యోగావకాశాలు విదేశస్తులకు కల్పించే వీలు కలుగుతుంది. టైర్ 2ననుసరించి భారతీయులు అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసేవారు బదిలీల పేరిట ఇక్కడకు వచ్చేవారు ఇక్కడే స్థిరపడేందుకు వీలులేదన్నారు.

వెబ్దునియా పై చదవండి