అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై భారత్ అధిక ప్రాధాన్యత!

అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రత కల్పించడంపై భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. భారత అణు విద్యుత్ కేంద్రాల్లోని భద్రతపై అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించవచ్చునని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది.

ఐక్యరాజ్య సమితి సభలో అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఎఈఏ)కి చెందిన వార్షిక నివేదికపై జరిగన చర్చ సందర్భంగా రాజ్యసభ ఎంపీ, ప్రేమ్ చంద్ గుప్త మాట్లాడుతూ భారత్‌లో పలు సంవత్సరాలుగా అణు కేంద్రాలు పటిష్ట భద్రతతో నడుస్తున్నాయని చెప్పారు.

ఇంకా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అణు కేంద్రాలున్నాయని వెల్లడించారు. అలాగే అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రతను కల్పించడంపై భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుప్త పేర్కొన్నారు. భారత్‌లోని అణు కేంద్రాల పనితీరుతో పాటు భద్రత వంటి అంశాలను పరిశీలించేందుకు ఐఏఈఏ ప్రతినిధులను భారత్‌కు ఆహ్వానిస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి