అణ్వాయుధాలతో దాడులు పెరిగే అవకాశం ఉంది: అమెరికా

FILE
అణ్వాయుధాలతో తీవ్రవాద దాడులు పెరిగే అవకాశం ఉందని అగ్రదేశమైన అమెరికా తెలిపింది. ప్రస్తుతం అణ్వాయుధాలతో ఉగ్రవాదుల దాడులు పెరిగే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయని అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో తీవ్రవాద చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లి పోతున్న నేపథ్యంలో.. ఉగ్రవాదులు అణ్వాయుధాలు ఉపయోగించడం కూడా అధికమవుతుందని చెప్పారు.

ఇంకా ప్రముఖ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా అణ్వాయుధాలతో ప్రపంచ అగ్రదేశాలపై దాడులు జరిపే అవకాశం ఉందని క్లింటన్ హెచ్చరించారు. దీంతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తమై అణ్వాయుధాలను నిరోధించడంతో పాటు అణు భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో అణు భద్రతపై సదస్సు జరుగుతుందని హిల్లరీ గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి