"అణ్వాయుధ నిరోధం"లో భారత్-పాక్‌లదే పైచేయి!: క్లింటన్

PTI
"అణ్వాయుధ నిరోధం"పై భారత్-పాక్‌లు సమతూక చర్యలు చేపట్టాయని అమెరికా విదేశాంగ శాఖామంత్రి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్‌లు అణ్వాయుధాలను పరిమితంగా వినియోగించే విషయంలో అమెరికా తీవ్రంగా కృషి చేస్తోందని హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. అణ్వాయుధాల నిరోధంపై ఇరుదేశాల తగిన తీసుకోవాలని సూచించడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.

లూజీవిల్లీ యూనివర్శిటీలో జరిగిన న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ సదస్సులో హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల నిరోధం, ఆవశ్యకత గురించి వివరించారు. అణ్వాయుధాలను కేవలం శాంతియుత చర్యలకే ఉపయోగించాలని ఆమె సూచించారు. అణ్వాయుధాలను అపరిమితంగా వాడటం వల్ల కలిగే నష్టాలను ఎత్తిచూపిన క్లింటన్, శాంతియుత ఆవశ్యకతకే అణుశక్తిని వాడాలని పునరుద్ఘాటించారు.

వెబ్దునియా పై చదవండి