అత్యవసర పరిస్ధితిని ప్రకటించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం

థాయిలాండ్‌లో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు తీవ్రతరమైనాయి. దీంతో రాజధాని బ్యాంకాక్‌తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రధానమంత్రి అభిసిత్‌ వెజ్జాజివా మీడియాకు వెల్లడించారు.

పదవీచ్యుతుడైన ప్రధానమంత్రి తక్సిన్‌ షినవత్రా రెడ్‌ షర్ట్ మద్దతుదారులు బుధవారం థాయిలాండ్‌ పార్లమెంట్‌ను దిగ్బంధించారు. ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతోనే వారు తమ పోరాటాన్ని నడుపుతున్నారు. అత్యంత నాటకీయ పరిణాల మధ్య ఆందోళనకారులు పార్లమెంట్‌ను ఒక్కసారిగా ముట్టడించారు.

ఆందోళనలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు గ్రామీణ పేదలు, కార్మికులే కావడం విశేషం. అభిసిత్‌ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చిందంటూ వారు తీవ్రంగా మండిపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి